Fri Dec 05 2025 11:26:32 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు, రేపు సమవేశాలు జరగనున్నాయి. తొలుత 9.46 గంటలకు సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చచేసి రిజిస్టర్ లో సంతకం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత నిన్న రాజ్‌భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
సభ్యుల చేత ప్రమాణ స్వీకారం...
తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంగ్లీష్ అక్షరాల వరస క్రమంలో సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఈరోజు కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాత్రమే సమావేశం పరిమితమవుతుంది. స్థలాభావం కారణంగా ఎవరికీ విజిటింగ్ పాస్ లు జారీ చేయడం లేదు. కుటుంబ సభ్యులతో పాటు ఎవరికీ శాసనసభ సమావేశాలకు అనుమతించడం లేదని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు.
Next Story

