Sat Dec 13 2025 19:29:28 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో కొత్త కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఆరు రోజుల పాటు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల వద్దకు వెళతారు. 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ ఆరు రోజులు ప్రతి ఇంటికి వెళ్లి అగ్రికల్చర్, మార్కెటింగ్, ప్రజాప్రతినిధులు వెళతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆరు రోజుల్లో కొందరి రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. ఏ ఏ పంటలు వేయాలి? మార్కెటింగ్ ఎలా చేయాలి? లాభాలు వచ్చే పంటలపై ఫోకస్ పెట్టడంపై రైతుల్లో అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.
రైతన్నా మీకోసం పేరుతో...
పంటల ఎంపికలోనే లాభం ఉంటుందని చెప్పనున్నారు. ఏఏ పంటలకు జాతీయంగా డిమాండ్ ఉన్నదీ వివరించనున్నారు. పంచసూత్రాల ద్వారా రైతులకు ఏమేం ప్రయోజనాలు చేకూరుతాయో వివరించనున్నారు. అలాగే పంటల్లో ఎరువులు, పరుగు మందులు వాడకుండా ఉంటే గిట్టుబాటు ధర లభించే అవకాశాన్ని కూడా వారికి వివరించనున్నారు. కూటమి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులందరూ ఈ రైతన్న మీకోసం కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Next Story

