Thu Mar 19 2026 19:21:55 GMT+0530 (India Standard Time)
నేనూ కార్మికుడిలో ఒకడినే : మంత్రి వాసంశెట్టి సుభాష్
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ కొద్దిసేపటి క్రితం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ కొద్దిసేపటి క్రితం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఆయన తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
గత ప్రభుత్వం...
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో కార్మిక చట్టాలను తుంగలో తొక్కారన్నారు. చట్టాలు అమలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు వచ్చే ఒక శాతం సెస్సును వైసీపీ పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. కార్మికుల అభ్యున్నతికి తాను కూడా ఒక కార్మికుడిగా పనిచేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గత ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో విఫలమైందని, టీడీపీ విజయంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
Next Story

