Mon Mar 16 2026 04:26:53 GMT+0530 (India Standard Time)
గుండెపోటుతో వైసీపీ నేత మృతి
ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు మరణించారు.

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు మరణించారు. అర్ధరాత్రి గుండెపోటుకు గురైన సర్రాజు మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులున్నారు. 2004లో ఉండి నియోజకవర్గం నుంచి పాతపాటి సర్రాజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా...
అనంతరం ఆయన వైసీపీలో చేరారు. ఆయనకు క్షత్రియ కార్పొరేషన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను జగన్ అప్పగించారు. నిన్న రాత్రి భీమవరంలో ఒక వివాహ వేడుకకు హాజరై పది గంటల వరకూ నేతలతో కలసి గడిపారు. రాత్రి ఇంటికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో భీమవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారు. పాతపాటి సర్రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు పలువురు మంత్రులు, నేతలు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

