Tue Mar 17 2026 18:31:26 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఐసెట్, ఈసెట్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఐసెట్, ఈసెట్ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఐసెట్, ఈసెట్ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల వెల్లడించిన తర్వాత త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
పరీక్ష ఫలితాల కోసం...
నేడు ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి నుంచి సమాచారం అందింది. ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ నిర్వహిస్తుండగా, పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ సెకండియర్ లోప్రవేశాలు కల్పించేందుకు ఈసెట్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
Next Story

