Sun Mar 22 2026 09:35:34 GMT+0530 (India Standard Time)
మరో రెండు రోజులు వర్షాలే
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రెండు రోజులు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈరోజు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శనివారం కూడా ఈ ప్రాంతాల్లో భారీ వర్ష పాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ప్రకాశం జిల్లాలో నిన్న అత్యధిక వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలోనూ....
తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు తప్పవని తెలిపింది. హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు తడిసి ముద్దవుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే అవకాశాలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Next Story

