Sun Mar 15 2026 10:21:36 GMT+0530 (India Standard Time)
Ambati : ఖమ్మంలో అంబటికి నిరసన సెగ
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన ఖమ్మం వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు వైసీీపీకి, అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలతో అంబటి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసినట్లు నేతలు ఆరోపిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషించారని కూడా అంటున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు నిరసనగానే ఈ దాడికి దిగినట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారు.
కర్రలతో వచ్చి...
అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తనపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారని, కర్రలతో వచ్చి దాడికి పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. తనపై దాడికి ప్రయత్నించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Next Story

