Sat Dec 06 2025 02:31:01 GMT+0000 (Coordinated Universal Time)
Nara Loksh : ప్రధాని మోదీతో కలసి భోంచేసిన లోకేశ్ ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాలోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాలోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో కలసి వెళ్లిన లోకేశ్ దాదాపు రెండు గంటల వరకూ ప్రధాని నివాసంలో ఉన్నారు. శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి వెళ్లిన లోకేశ్ రాత్రి 930 గంటల వరకూ అక్కడే ఉన్నారు. నారాలోకేశ్ తో పాటు సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలసి ఆయన ప్రధానిని కలిశారు.
పుస్తకాన్ని ఆవిష్కరించి...
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి నారా లోకేశ్ ను కుటుంబంతో సహా తన వద్దకు రావాలని ప్రధాని స్వయంగా ఆహ్వానించడంతో లోకేశ్ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కలసి నారా లోకేశ్ కుటుంబ సభ్యులు కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు తాను చేసిన యువగళం పాదయాత్రకు సంబంధించిన బుక్ ను ప్రధాని ఆవిష్కరించారు. ఆ పుస్తకంపై సంతకం చేసి ప్రధాని ఇచ్చారు. ప్రధాని మోదీతో సమావేశం మర్చిపోలేని అనుభూతి అని లోకేశ్ తెలిపారు.
Next Story

