Fri Dec 05 2025 11:26:36 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : సోషల్ మీడియాను నియంత్రించబోం.. కానీ?
సోషల్ మీడియాను నియంత్రించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు

సోషల్ మీడియాను నియంత్రించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. అయితే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పార్ధసారధి అభిప్రాయపడ్డారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోబోమని, అలాగని ప్రభుత్వంపైన కానీ, నేతలపైన కానీ బురదజల్లితే మాత్రం ఊరుకోబోమని పార్ధసారధి హెచ్చరించారు.
వ్యక్తిత్వహననం...
వ్యక్తిత్వ హననం, మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు ఉంటాయని పార్ధసారధి తెలిపారు. తప్పుడు పోస్టులతో ఏపీ బ్రాండ్‌ను చెడగొడితే ఊరుకోబోమన్న మంత్రి పార్ధసారధి అన్నీ అధ్యయనం చేశాకే చట్టం తీసుకొస్తామని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. సోషల్ మీడియా అనేది ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story

