Sun Apr 05 2026 17:21:05 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : గుడ్ న్యూస్... పేదలకు తీపిబురు... రెండేళ్లలో అందరికీ ఇళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు తీపికబురు చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు తీపికబురు చెప్పింది. వచ్చే రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలం ఇవ్వనున్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఉంటే వాటిలో ఇళ్లు స్థలాలు ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాలనీల్లో ఇళ్లు కట్టుకున్నవారిని వదిలేసి.. అక్కడ స్థలం వద్దుకునేవారి స్థలాలు రద్దు చేయాలని సూచించారు.
వీలయినంత త్వరగా...
అక్కడ కావాలంటే మూడు సెంట్లు ఇవ్వాలని.. ఒకవేళ వద్దనే వారికి మరో చోట ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. రెండేళ్లలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రానున్న కాలంలో ఇల్లు లేదు అని ఎవరి వద్ద నుంచి తమకు ఫిర్యాదులు అందకూడదన్న ఆదేశాలను చంద్రబాబు అధికారులకు ఇచ్చారు. ఇల్లు లేని వారిని పేదలుగానే గుర్తించి వారికి అవసరమైన అన్ని పథకాలను వర్తింప చేయాలని కూడా ఆదేశించారు.
మూడు లక్షల ఇళ్లు సిద్ధం...
2015 నుంచి 2024 మే వరకు మొత్తం 18 లక్షల ఇళ్లకు 7.27 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షల ఇళ్లు పూర్తి చేశారని.. టిడ్కో ఇళ్లు కూడా కలిపి 2.50 లక్షలఇళ్ల గృహప్రవేశాలు చేయబోతున్నామన్నారు. ఇటీవల చంద్రబాబు కొన్ని గృహాలను ప్రారంభించారు. ఇవన్నీ కలిపితే మొత్తం 5.50 లక్షల వరకు ఇళ్లు పూర్తవుతాయన్నారు. మరో 5.27 లక్షల ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. కేంద్రం హౌసింగ్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించిందన్నారు. కాబట్టి ఆలోగా ఇళ్లు పూర్తి చేయాలని సూచించారు.. ఒకవేళ పూర్తి చేయలేకపోతే కేంద్రం నుంచి నిధులు కూడా రావన్నారు. జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఇళ్లు పూర్తి చేసేలా చొర తీసుకోవాలన్నారు.
Next Story

