Sun Mar 15 2026 19:25:52 GMT+0530 (India Standard Time)
నూతన భవనంలోకి హోంమంత్రి గృహ ప్రవేశం
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించడంతో ఆమె విజయవాడలో ఒక కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొత్త ఆటోనగర్ లోని పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కు చెందిన నాలుగు అంతస్థుల భవనాన్ని వంగలపూడి అనిత తన ఇంటి కోసం అద్దెక తీసుకున్నారు.
క్యాంప్ కార్యాలయంగా...
నాలుగు అంతస్థుల ఈ భవనంలో నివాసంతో పాటు క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకోవాలని వంగలపూడి అనిత నిర్ణయించారు. ఆమె తన కుమార్తెతో కలసి గృహప్రవేశం చేశారు. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇకపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ ఆఫీస్ గా ఇదే కొనసాగనుంది.
Next Story

