Tue Jan 20 2026 17:00:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వర్మ, పోసాని పిటీషన్లపై విచారణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి పిటీషన్లపై విచారణ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రెండు కేసుల విచారణ జరగనుంది. ఒకటి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటీషన్ పై విచారణ జరగనుంది. వర్మకు గుంటూరు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని కోరారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు చేసినందుకు ఆయనపై సీఐడీ కేసు నమోదయింది.
క్వాష్ చేయాలని...
మరోవైపు సినీనటుడు పోసాని కృష్ణమురళి పిటీషన్ కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పోసాని కృష్ణమురళిపై వరసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆయనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనపై నమోదయిన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పోసాని తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story

