Tue Mar 17 2026 00:15:22 GMT+0530 (India Standard Time)
వికేంద్రీకరణ పిటీషన్ పై హైకోర్టులో?
మూడు రాజధానులు, సీఆర్టీఏ రద్దు బిల్లులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరిగింది

మూడు రాజధానులు, సీఆర్టీఏ రద్దు బిల్లులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ పిటీషన్ లను విచారించిన హైకోర్టులో పిటీషనర్ల తరుపున న్యాయవాదులు దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని అన్నారు. దీనిపై ప్రభుత్వం తరుపున న్యాయవాది స్పందిస్తూ బిల్లులు గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయని, ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో వాటిని క్లియర్ చేయలేదని చెప్పారు.
గెజిట్ నోటిఫికేషన్....
గవర్నర్ ఆమోదించిన వెంటనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. దీనిపై విచారణలో ఇరువర్గాల వాదనలను విన్న ధర్మాసనం వచ్చే నెల 27వ తేదీకి కేసును వాయిదా వేసింది.
Next Story

