Thu Mar 19 2026 02:59:20 GMT+0530 (India Standard Time)
రాజధాని ఏది అని అడుగుతున్నారు? జస్టిస్ దేవానంద్
రాజధాని వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు

రాజధాని వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. విజయవాడలో జరిగిన అమృతభారతి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజధాని అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన కుమార్తెను ఢిల్లీలో మీ రాజధాని ఏదంటూ స్నేహితులు ఆటపట్టిస్తున్నారని ఆయన అన్నారు.
ముందు చూపు లోపించడం వల్లనే...
కొందరిలో ముందు చూపు లోపించడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. హ్రస్వ దృష్టితో చూసే వారి ఆలోచనల్లో మార్పు తేవడానికి రచనలు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మన పిల్లలు కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకసారి రాజకీయ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి అంశానికి రాజకీయం, కులం, స్వార్థ ప్రయోజనాలను పట్టి పీడిస్తున్నాయని జస్టిస్ దేవానంద్ బట్టు అన్నారు.
Next Story

