Thu Mar 19 2026 11:56:30 GMT+0530 (India Standard Time)
వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంశీ ఎన్నిక చెల్లదని యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. ప్రసాదంపాడు బూత్ లో రిగ్గింగ్ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారని పిటీషనర్ తెలిపారు. బాపులపాడు ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేశారని కూడా పిటీషనర్ ఆరోపించారు.
తదుపరి విచారణను...
వంశీ ఆయన అనుచరులు 12 వేల నకిలీ పట్టాలను పంపిణీ చేశారని అన్నారు. రెండేళ్ల క్రితం నుంచి వల్లభనేని వంశీకి కనీసం నోటీసులు జారీ చేయలేదని పిటీషనర్ తెలిపారు. దీంతో వల్లభనేని వంశీకి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

