Sun Mar 22 2026 22:37:25 GMT+0530 (India Standard Time)
నేడు సినిమా టిక్కెట్ల పై హైకోర్టులో?
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల నిర్ణయంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల నిర్ణయంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ జీవో నెంబరు 35ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జీవో నెంబరు 35ను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. సినిమా థియేటర్ల యాజమాన్యాలు టిక్కెట్ల రేట్లు పెంచుకోవచ్చని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది.
ఇరువురి వాదనలను....
డివిజనల్ బెంచ్ దీనిపై విచారించి జాయింట్ కలెక్టర్ అనుమతితో టిక్కెట్ల రేట్లు పెంచుకోవచ్చని పేర్కొంది. అయితే దీనిపై నేడు హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ జరగనుంది. సామాన్యుడికి వినోదాన్ని అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతోనే సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించామని ప్రభుత్వం వాదిస్తుంది. అయితే టిక్కెట్ల ధరలను తగ్గించడంతో తాము నష్టపోతున్నానమని థియేటర్ల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించాయి.
Next Story

