Thu Dec 18 2025 18:07:55 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఐఏఎస్ కు జైలు శిక్ష
కోర్టు థిక్కరణకు పాల్పడినందుకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది

కోర్టు థిక్కరణకు పాల్పడిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించింది. ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ , ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణలకు నెల రోజుల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానాను విధించింది.
విద్యాశాఖలో...
ఈ శిక్షలను వెంటనే అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని సూచించింది. గతంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన బుడితి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ గా పనిచేసిన రామకృష్ణలు కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే రాజశేఖర్ సెలవుపై ఉన్నారు. రామకృష్ణ ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీ గా ఉన్నారు.
Next Story

