Sun Mar 15 2026 14:05:48 GMT+0530 (India Standard Time)
లక్ష్మీనారాయణకు బెయిల్ మంజూరు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. స్కిల్ డెవలెప్ మెంట్ లో జరిగిన అవినీతి కేసులో లక్ష్మీనారాయణ ఏ 2 నిందితుడిగా ఉన్నారు. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ను లక్ష్మీనారాయణకు మంజూరు చేసింది.
15 రోజుల పాటు....
పదిహేను రోజుల పాటు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయవద్దంటూ బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈరోజు ఏపీ సీఐడీ అధికారుల ఎదుట లక్ష్మీనారాయణ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉంటూనే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు.
Next Story

