Tue Feb 24 2026 20:29:00 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసింది

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై నిలదీసింది. ఇది కోర్టు థిక్కారణ కింద పరిగణించాల్సి వస్తుందని తెలిపింది. రేపు న్యాయస్థానంలో హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించి నియామకాలపై ఏపీ హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలని అభిప్రాయపడింది.
థిక్కారం కింద...
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్ 1 పరీక్షల వాల్యుయేషన్ కు సంబంధించిన కేసుపై విచారణ చేపట్టినసందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఎవరైతే ఆ నోటిఫికేషన్ లో అర్హత సాధించి ఉద్యోగాల్లో చేరి విధులను నిర్వహిస్తున్నారో వారందరినీ ప్రాధాన్యత లేని పోస్టులకు పంపాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఆదేశాలను పాటించకపోవడం పై చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సుమోటోగా థిక్కరణ కేసు నమోదు చేయకూడదో చెప్పాలని, రేపు ఉదయం 10.30 గంటలకు న్యాయస్థానానికి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story

