Fri Dec 05 2025 17:43:14 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కూడా భారీ వర్షాలు.. ఎవరూ బయటకు రావద్దు
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలో ఈరోజు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నదులు పొంగుతున్నాయి. తిరిగి ఈరోజు ఉదయం నుంచి వర్షం ప్రారంభం కావడంతో విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
విద్యాసంస్థలకు సెలవు...
ఈరోజు కూడా అత్యవసర పని ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దని కలెక్టర్ కోరారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే తరలించి సహాయ శిబిరాల్లో ఉంచారు. వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తిరుపతి ఘాట్ రోడ్ లను కూడా మూసివేశారు. భక్తులను తిరుపతిలోనే ఉంచారు. వారికి శ్రీనివాసంలో వసతిని కల్పించారు.
Next Story

