Thu Mar 19 2026 05:51:04 GMT+0530 (India Standard Time)
ఏపీలో వరద నష్టం ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టం భారీ స్థాయిలో సంభవించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టం భారీ స్థాయిలో సంభవించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రస్తుతం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగానికి మొత్తం 1,354 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు.
రహదారులు....
చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 1,42,862 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. రహదారులు, కల్వర్టులు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. రహదారులు, కల్వర్టులకు 1,756 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ మేరకు ప్రాధమిక నష్టం అంచనా వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.
Next Story

