Mon Mar 16 2026 04:54:44 GMT+0530 (India Standard Time)
గవర్నర్ కు మరోసారి అస్వస్థత.. హైదరాబాద్ కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను మరోసారి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను మరోసార ిహైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆయన మరోసారి అనారోగ్యం బరిన పడటంతో హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఆయనకు అక్కడ అన్ని వైద్య పరీక్షలు చేశారు.
వారం రోజుల క్రితమే....
వారం రోజుల క్రితం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా సోకడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకుని విజయవాడకు వచ్చారు. కానీ మరోసారి అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.
Next Story

