Sat Dec 06 2025 17:39:06 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 20న విశాఖకు గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20వ తేదీన విశాఖ పర్యటనకు వెళతారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20వ తేదీన విశాఖ పర్యటనకు వెళతారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన విశాఖకు వెళ్లనున్నారు. ఈ నెల 20 వ తేదీన రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విశాఖకు రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ వెళ్లనున్నారు. ఈ నెల 21వ తేదీన నావల్ డాక్ యార్డులో జరిగే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో గవర్నర్ హరిచందన్ పాల్గొననున్నారు.
రాష్ట్రపతికి...
ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడకు రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ విశాఖ పర్యటనకు వెళుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

