Tue Mar 31 2026 07:49:07 GMT+0530 (India Standard Time)
నేడు గవర్నర్ డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు డిశ్చార్జ్ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు డిశ్చార్జ్ కానున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్న గవర్నర్ గత కొద్ది రో్జులుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెెండోసారి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.
ఆరోగ్యం కుదుటపడటంతో...
అయితే గవర్నర్ ఆరోగ్యం కుదుటపడిందని, ఈరోజు ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ అన్ని రకాల సమస్యల నుంచి బయటపడ్డారని తెలిపాయి. కోవిడ్ బారిన పడిన తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండుసార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
Next Story

