Tue Sep 26 2023 03:18:55 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రిలో గవర్నర్ : స్వల్ప అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు, అధికారులు వెంటనే ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అన్ని పరీక్షలను వైద్యులు నిర్వహించిన తర్వాత చిన్నపాటి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
ఆపరేషన్ చేయాలని...
ఆపరేషన్ చేయాల్సి ఉందని మణిపాల్ వైద్యులు కూడా చెప్పారు. ఆయనకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. గవర్నర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా వైద్యులు చెబుతున్నారు. చిన్న పాటి ఆపరేషన్ చేసిన తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేసి పంపుతామని తెలిపారు.
Next Story