Sun Mar 08 2026 12:11:27 GMT+0530 (India Standard Time)
ఏపీ గవర్నర్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు ఎండోస్కోపిక్ పరీక్ష చేయాలని వైద్యులు చెబుతున్నారు.
నిలకడగానే ఉందని...
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. గవర్నర్ అస్వస్థతకు గురికావడం తెలిసి పలువురు రాజకీయ పార్టీ నేతలు ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై నజీర్ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
Next Story

