Fri Dec 05 2025 13:01:44 GMT+0000 (Coordinated Universal Time)
Talliki Vandanam : తల్లికి వందనం నిబంధనలు ఇవే.. ఇవి పాటిస్తేనే ఖాతాల్లోకి నిధులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి తల్లి అకౌంట్ లోఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయమన్నారు. దీని ద్వారా తల్లికి పిల్లలు చదువులు చదివించడానికి కావలసిన ఆర్థిక స్తోమత లభించనుంది. అయితే ఈ పథకాన్ని అందుకునేందుకు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం విధించిన నిబంధనలు అమలు జరిగితేనే డబ్బులు వారి అకౌంట్లోకి వచ్చి పడతాయి.
బ్యాంకు అకౌంట్ కు లింకు...
లబ్దిదారులు తమ న బ్యాంక్ అకౌంట్ యొక్క బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంది. లేకపోతే మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయంలో లేదా మీసేవ కేంద్రంలో కూడా ఎన్.పి.సీ.ఐ లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ : npci.org.in ద్వారా స్టేటస్ ను చూసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింక్ స్టేటస్ ను చెక్ చేసుకోవడానికి బ్యాంకుకు నేరుగా వెళ్వచ్చు. లేక గ్రామ సచివాలయం ద్వారా కూడా చెక్ చేసుకునే వీలుంది. దీంతో పాటు ఎన్.పి.సీ.ఐ లింకు చెకింగ్ మేళాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది.
అధికార ప్రకటన...
తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏడాదికి పదిహేను వేల రూపాయలు విద్యార్థికి ప్రభుత్వం అందచేస్తుంది. ఒక కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరికీ తలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఇందుకు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. కొన్ని షరతులు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం చెప్పింది. విద్యర్థికి ప్రభుత్వపాఠశాలలో డెబ్భయి ఐదు శాతం హాజరు ఉండి తీరాలి. హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ₹15,000/- ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే ఈ నిధులు ఒకే సారి విడుదల చేస్తారా? విడతల వారీగా జమ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడతల వారీగా ఇస్తామని చెప్పారు. కానీ దీనిపై అధికార ప్రకటననేడో, రేపో వెలువడనుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి నిధులను కూడా విడుదల చేసింది.
Next Story

