Sun Dec 07 2025 18:03:54 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు మరో కొత్త పథకం ప్రారంభం.. పదిహేను వేలు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మరొక కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మరొక కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు వారి ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ పధకం ప్రవేశపెట్టనుంది. గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఏడాదికి ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తుండగా, కూటమి ప్రభుత్వం ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
నిధులను విడుదల చేసి...
ఇందుకోసం మార్గదర్శకాలను ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. దాని ప్రకారం అర్హులైన లబ్దిదారుల జాబితాను అధికారులు ఎంపిక చేశారు. ఈ ఏడాది అన్ని అర్హతలున్న 2,90,669 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ సేవలో పథకానికి అర్హులుగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం 436 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇ:దులో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది ఉండగా, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది ఉన్నారు. వీరందరికీ నేడు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద పది హేను వేల రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. వారి వాహనాలకు అవసరమైన మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ నిధులను కేటాయిస్తుంది.
ఆటోలో చేరుకుని...
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొంటారు. అంతకంటే ముందు ప్రకాశం బ్యారేజీ నుంచి సభా వేదిక వరకూ వీరు నలుగురూ నాలుగు ఆటోల్లో ప్రయాణిస్తూ వేదిక వద్దకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. తర్వాత వారి ఖాతాల్లో నగదును బటన్ నొక్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు.
Next Story

