Sun Nov 03 2024 03:21:27 GMT+0000 (Coordinated Universal Time)
Liquor Shops : ఏపీ ప్రభుత్వానికి వద్దంటే డబ్బు.. ఖజానా ఫుల్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తుంది. రేపు మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీలను తీయనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తుంది. రేపు మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీలను తీయనుంది. ఎవరికి ఏ షాపు దక్కుతుందో రేపు సాయంత్రానికి క్లారిటీ రానుంద.ి ఈనెల 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలన్నీ తెరుచుకోనున్నాయి. ఏ ప్రభుత్వానికి అయినా ప్రధాన ఆదాయ వనరు మద్యం ద్వారానే వస్తుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, అభివృద్ధి పనులను నిర్వహించాలన్నా మద్యం పాలసీ ఒక్కటే ఏకైక మార్గం. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఏపీలో కొత్తగా ఏర్పాటయిన గత ప్రభుత్వం అమలు చేసిిన మద్యం విధానాన్ని కాదని కొత్త పాలసీని అమలులోకి తెచ్చింది.
పాత తరహాలోనే...
ఎప్పటి మాదిరిగానే పాత తరహాలో మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తుల చేతులకు అప్పగించింది. అయితే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం బాటిల్ ను విక్రయించే విధంగా నిబంధనలను పెట్టింది. నాణ్యమైన బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. గతంలో కొన్ని బ్రాండ్లు మాత్రమే మందుబాబులకు సర్కార్ లిక్కర్ షాపుల్లో అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ధర చెల్లించి మంచి బ్రాండ్ల మద్యాన్ని కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన మద్యాన్ని తాము అధికారంలోకి వచ్చాక తెస్తామన్న హామీని చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.
ఫీజు చెల్లించి...
అయితే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు నిర్ణయించారు. జనాభాను బట్టి రెండు లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకూ లైెసెన్స్ ఫీజులను పెట్టింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎవరు ఎన్ని దరఖాస్తులైనా, ఎన్ని దుకాణాలకైనా చేసుకోవచ్చని తెలిపింది. దీంతో తొలినాళ్లలో కొంత సిండికేట్ అయినట్లు కనిపించినా తర్వాత మద్యం దుకాణాల కోసం వ్యాపారులు ఎగబడ్డారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా ఆదాయం వచ్చిపడింది. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇక చెల్లించరన్న నిబంధన ఉండటంతో దరఖాస్తుల సంఖ్యను బట్టి లైెసెన్స్ ఫీజుల ద్వారా ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది.
దరఖాస్తు ఫీజు ద్వారా...
మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని 3,396 మద్యం దుకాణాలకు 89,992 దరఖాస్తులు ఎక్సైజ్ శాఖకు అందాయి. దీని ద్వారా ప్రభుత్వ ఖజనాకు 1,800 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దరఖాస్తుల ద్వారా పదిహేను వందల నుంచి పదహారు వందల కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వం అంచనాలను అధిగమించి ఆదాయం రావడంతో ప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. మ్యాన్యువల్ పద్ధతిలో రేపు డ్రా తీయనున్నారు. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు ఇరవై నాలుగు గంటల్లోగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిఉంటుంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలకు 5,823 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Next Story