Fri Mar 06 2026 20:49:52 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో వీరికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీసర్కార్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధం విధించాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నామని చంద్రబాబు తెలిపారు. దీనిపై మూడు నెలల్లో విధివిధానాలను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.
వీరికి కూడా...
పదమూడు నుంచి పదహారు ఏళ్ల పిల్లల విషయంలోనూ సోషల్ మీడియా చూడకుండా బ్యాన్ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా వల్ల నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకే పదమూడేళ్లలోపు సోషల్ మీడియా వాడకంపై నిషేధించనున్నామని, జీవితాలను నాశనం చేస్తుందని చంద్రబాబు అన్నారు.
Next Story

