Sat Feb 21 2026 13:24:40 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : గుడ్ న్యూస్.. కొత్త పింఛను కావాలా? అయితే ఇలా దరఖాస్తు చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఏపీలో పింఛన్ల కోసం చాలా మంది సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. నెలకు వృద్ధులు, వితంతువులకు నాలుగు వేల రూపాయలు వస్తుండటంతో పింఛను దరఖాస్తు చేసుకునేందుకు లక్షలాది మంది ఆశతో చూస్తున్నారు. ఇక వికలాంగులు కూడా తమకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్లకు ఇంత వరకూ అనుమతించలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పింఛనుదారులలో దాదాపు 1.40 లక్షల మంది అనర్హలునట్లు తనిఖీల్లో చేరింది. దీంతో కొత్తగా పింఛను తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
కావాల్సిన డాకుమెంట్స్ :
ఆదాయం, కులం సర్టిఫికెట్ లు లేటెస్ట్ వి కొత్త సంవత్సరం లో (2026) తీసుకోవాలి
గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఆదాయం సర్టిఫికెట్ లు తీసుకుని ఉంటే మీసేవ సెంటర్ కి వెళ్లి రెన్యువల్ చేయించుకోని ఆ సర్టిఫికెట్ లు ను తీసుకుని రావాల్సి ఉంటుంది.
1) ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్ కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
వితంతు పెన్షన్ దరఖాస్తుకు
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6)భర్త డెత్ సర్టిఫికెట్
ఒంటరి మహిళా పెన్షన్ కి
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6) విడాకుల సర్టిఫికెట్
వృధాప్య పెన్షన్ కోసం
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్ కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6)వయస్సు 60 సంవత్సరాలు పైన ఉండాలి.
వికలాంగుల పెన్షన్ కోసం
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3)రేషన్ కార్డు
4)ఇన్ కమ్ సర్టిఫికెట్
5)క్యాస్ట్ సర్టిఫికెట్
6)గవర్నమెంట్ డాక్టర్స్ చే నిర్దారించిన సదరం సర్టిఫికెట్ (వికలాంగులు అని నిర్ధారించే సర్టిఫికెట్ )
సచివాలయానికి వెళ్ళి జిరాక్స్ లు సమర్పించి క్రొత్త ఫించన్ లకు ఆన్ లైన్ చేయించుకోవచ్చు. త్వరలో కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చు
Next Story

