Wed Mar 18 2026 10:18:32 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఏపీలో దివ్యాంగ శక్తి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనుంది. దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణాన్ని నేటి నుంచి కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించి...
దీనికి దివ్యాంగ శక్తి అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దివ్యాంగులతో కలసి వీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారు. పోలీసులు, అధికారులు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

