Thu Feb 26 2026 12:33:46 GMT+0530 (India Standard Time)
Ap Free Bus : ఉచిత బస్సు ప్రయాణంలో కీలక నిర్ణయం.. ఇక వారికి కూడా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు పర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని దివ్యాంగులకు కూడా వర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీంతో త్వరలోనే దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందే వీలుంటుంది.
గత ఏడాది ఆగస్టు నుంచి...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. సిటీ, ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు సహా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నారు. నేటి వరకు 47 మంది కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.1660 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరించింది.
కొత్త బస్సుల కొనుగోలు...
ఈ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల శాతం నలభై శాతం నుంచి అరవై శాతానికి పెరిగిందని, రోజుకు సగటున 25 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఎక్కడా మహిళలు బస్సు ఎక్కితే సీటు కోసం కొట్లాడుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం భారం కాదని, దానివల్ల ఆక్యుపెన్సీ రేటు గణనీయంగా పెరిగిందని, సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం 75 శాతం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. పీఎంఈ బస్ సేవ ద్వారా 750 కొత్త బస్సులు రాష్ట్రానికి త్వరలో రానున్నాయని, సీఎన్జి, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Next Story

