Fri Mar 21 2025 08:07:45 GMT+0000 (Coordinated Universal Time)
Anna Datha Sukhibhava : ఈ నెలలోనే రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాలో డబ్బులు పడటం ఖాయమట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమయింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి ఆరువేల రూపాయలను జమ చేస్తుంది. మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేయనుంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 19 సార్లు పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఇప్పుడు మరోసారి నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన రెండు వేల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
ఇరవై వేలు ఇస్తామని...
అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను జత చేసి చెల్లించాలని భావిస్తుంది. ఈ మేరకు చంద్రబాబు గతంలో ప్రకటించారు. రైతులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల రూపాయల నిధులు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఖాజానాలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే మూడు విడతలుగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే వచ్చే బడ్జెట్ లో అన్నదాత సుఖీ భవ పథకానికి నిధులు కేటాయించాలని భావించారు. కానీ ఈలోగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి.
మూడు విడతలుగా...
ఇరవై వేల రూపాయలంటే మూడు విడతలుగా మొదటి రెండు రెండు విడతలు నాలుగు వేలు, చివరి విడత ఆరువేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఏడాదికి రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరువేల రూపాయలు ఇస్తే, తాము మూడు విడతలుగా పథ్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఫిబ్రవరిర 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలకు మరో నాలుగు వేల రూపాయలు కలిపి ఇవ్వాలని చంద్రబాబు అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఇందుకు అర్హులైన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వారికే ఇవ్వాలన్నది ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
Next Story