Fri Dec 05 2025 22:44:16 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో 14,493 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సిద్ధమయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సిద్ధమయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,493 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. త్వరలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత సేవలందించేందుకు ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
వచ్చే జూన్ నాటికి....
దీంతో పాటు వచ్చే జూన్ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రొబిషన్ ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 11,162 గ్రామాల్లో, 3,842 పట్టణాల్లో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
Next Story

