Fri Mar 20 2026 22:19:01 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి బడ్జెట్‌కు కసరత్తులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటి వరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని యోచిస్తుంది. ఇందుకోసం కసరత్తులు ప్రారంభించింది. సెప్టంబరు నెలలో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు.
19వ తేదీ నుంచి...
ఈ నెల 19వ నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

