Fri Dec 05 2025 09:56:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో టెస్లా కంపెనీ రాకకు ప్రయత్నం ముమ్మరం
ఆంధ్రప్రదేశ్ లో అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ లో అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధానితో జరిగే చర్చల్లో...
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెస్లా ముఖ్య ప్రతినిధులతో సమావేశం జరిపేందుకు తమకు అవకాశమివ్వాలని కోరినట్లు తెలిసింది. తమ ప్రాంతంలో ఇప్పటకే కియా కార్ల పరిశ్రమ ఉందని, దానికి సంబంధించిన రాయితీలను కూడా చంద్రబాబు వివరించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు టెస్లా కంపెనీ వస్తే మరో ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఏపీకి వస్తుందని భావించి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రధానితో జరిగే సమావేశంలోనూ దీనిపై చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

