Wed Dec 17 2025 08:44:55 GMT+0000 (Coordinated Universal Time)
వంద కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీలు
వంద కోట్ల రూపాయలతో మూడు పాలిటెక్నిక్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడానికి ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వంద కోట్ల రూపాయలతో మూడు పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యువత తమ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఈ కళాశాలలు ఉపయోగపతాయని ప్రభుత్వం చెబుతుంది.
సీమ ప్రాంతంలోని...
నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, కడప జిల్లాలోని మైదుకూరులో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్ వంటి కోర్సులుంటాయని చెబుతున్నారు. ఈ కోర్సులు చదివి ఉపాధి అవకాశాలను వెంటనే అందిపుచ్చుకునే వీలుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
Next Story

