Fri Apr 03 2026 15:40:52 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కారుణ్య నియామకాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కారుణ్య నియామకాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా కరోనా వదిలిపెట్టడం లేదు. ఎందరినో బలి తీసుకుంది. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విషయంపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులు అందరికీ వర్తిస్తుందని పేర్కొంది.
జూన్ 30 లోగా....
కరోనా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోగా ఉద్యోగం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. మృతి చెందిన ఉద్యోగి పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగం మాత్రమే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
Next Story

