Fri Dec 05 2025 15:42:47 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతల్లో మార్పులు, చేర్పులు చేపడుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతల్లో మార్పులు, చేర్పులు చేపడుతూ నిర్ణయం తీసుకున్నారు.ఆగస్టు 15వ తేదీన జెండా ఆవిష్కరణ, ఉచిత బస్సు పథకం ప్రారంభం చేయాలని మంత్రులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇన్ ఛార్జి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సొంత జిల్లాల్లోనే...
మంత్రులందరూ సొంత జిల్లాలోనే జెండా ఆవిష్కరించాలని అక్కడే ఉచిత బస్సు పథకాన్ని ప్రాంభించాలని ఆదేశాలు చేసింది. గతంలో ఏ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉంటే ఆ జిల్లాలోనే జెండా మంత్రులు ఆవిష్కరించేవారు. ఉచిత బస్సు పథకం అమలు చేయనున్న నేపథ్యంలో సొంత జిల్లాలోనే పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది.
News Summary - andhra pradesh government has taken another key decision. decision has been taken to make changes and additions to the responsibilities of the district in-charge ministers
Next Story

