Fri Dec 05 2025 13:17:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కల్పించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కల్పించింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగించింది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో సివిల్ కోర్టులకే ఈ అధికారం ఉండేది.
అక్రమ రిజిస్ట్రేషన్లను...
అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టంలో ఈ మార్పులు చేసింది. ఏపీ యాక్ట్ ఎమెండ్ మెంట్-2023 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతోచట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లు అయిన భూములను గుర్తించి కలెక్టర్లు తమ సొంత నిర్ణయాలు తీసుకుని ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అవకాశాన్ని కల్పించింది.
Next Story

