Fri Dec 05 2025 20:14:58 GMT+0000 (Coordinated Universal Time)
Pulivendula : పులివెందులలో వారికి షాకిచ్చిన బాబు సర్కార్.. జగన్ అక్కడకు చేరుకునేలోగానే
మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా జగన్ కు షాక్ ఇచ్చినట్లయింది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్ లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఇళ్ల మంజూరులో...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 8,400 ఇళ్లు మంజూరు అయ్యాయి. అయితే ఈ ఇళ్లకు అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.
Next Story

