Fri Dec 05 2025 16:21:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి ముందుగానే రేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ ను ఇంటికే డెలివరీ చేయాలని నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ ను ఇంటికే డెలివరీ చేయాలని నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచి జులై నెల రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించింది. జులై నెల రేషన్‌ను నాలుగు రోజుల ముందుగానే ప్రభుత్వం ఇవ్వనుంది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఇంటివద్దకే డెలివరీ
సమాచార లోపం వల్ల గతనెల రేషన్ డిపోలకు వచ్చిన వృద్ధులు రావడంతో ఇబ్బందులు పడినట్లు తెలియడంతో వారు రేషన్ దుకాణాలకు రాకుండా వారి ఇళ్లవద్దకే నేటి నుంచి జులై నెల రేషన్ ను పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వికలాంగులకు మాత్రమే డోర్ డెలివరీ చేస్తారు. మిగిలిన వారు రేషన్ దుకాణాల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. గతనెల సమస్య దృష్ట్యా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.
Next Story

