Wed Mar 18 2026 06:45:14 GMT+0530 (India Standard Time)
రాధాకు భద్రతను పెంచండి... జగన్ ఆదేశం
వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన ఇటీవల తన హత్యకు కుట్ర జరిగిందని, రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదే సభలో ఉన్న మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వంగవీటి రాధా విషయంపై వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఇంటలిజెన్స్ డీజీని ఆదేశించినట్లు తెలిసింది. అసలు అక్కడ జరిగిందేమిటి? ఎవరు రెక్కీ నిర్వహించారు? వంటి విషయాలను వంగవీటి రాధాతో మాట్లాడాలని జగన్ ఆదేశించారని చెబుతున్నారు.
డీజీపీకి....
అదే సమయంలో వంగవీటి రాధాకు 2+2 భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు వెంటనే భద్రతను పెంచాలని జగన్ డీజీపీని ఆదేశించినట్లు తెలిసింది. ఈరోజు నుంచి వంగవీటి రాధాకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంగవీటి రాధా తనకు ప్రాణహాని ఉందని, తనపై రెక్కీ జరిగిందని చెప్పిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది.
Next Story

