Thu Mar 19 2026 06:08:16 GMT+0530 (India Standard Time)
రోడ్ షోలపై ఏపీలో నిషేధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారులపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారులపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రోడ్లు, మార్జిన్లకు నిబంధనలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది.
బహింగ ప్రదేశాల్లోనే....
రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలను ఎంపిక చేసుకుని అందులో సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. అత్యంత అరుదైన సందర్భాల్లోనే షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ హెచ్చరించింది. కందుకూరు, గుంటూరు ఘటనలో 11 మంది మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story

