Sun Mar 15 2026 13:39:26 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ పథకానికి నిధుల విడుదల
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలివిడత నిధులను 895 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు 2,684 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
మొదటి విడతగా...
మొదటి విడత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి లబ్దిదారులకు పంచేందుకు వీలుగా 895 కోట్ల రూపాయలను తొలుత విడుదల చేసింది. రేపటి నుంచి బుకింగ్స్ కూడా ప్రారంభం కానుండటంతో ముందుగానే నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీపావళి రోజున చంద్రబాబు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Next Story

