Sat Mar 07 2026 15:11:54 GMT+0530 (India Standard Time)
జీతాలు సిద్ధం చేయండి.. మరోసారి ప్రభుత్వం ఆదేశాలు
ఫిబ్రవరి 1 కల్లా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఫిబ్రవరి 1 కల్లా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతభత్యాలను సిద్ధం చేయాలని ట్రెజరీ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. రేపటి లోగా జీతాల చెల్లింపు కోసం అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. కొత్త జీతాల పై కసరత్తును వెంటనే ప్రారంభించి నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
పాత జీతాలే కావాలంటున్నా....
ఈ నెల జీతంపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పాత జీతాలు చెల్లిస్తేనే తాము తీసుకుంటామని వారు చెబుతున్నారు. కొత్త జీతాలు మాకు అవసరం లేదంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త జీతాలను చెల్లించాలని, ఫిబ్రవరి 1న అకౌంట్ లో పడిపోవాలని ఆదేశాలు జారీ చేయడం విశేషం.
Next Story

