Fri Dec 05 2025 18:06:34 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఇంటి వద్దకే స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ
ప్రజలకు ఇంటి వద్దకే క్యూ ఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది.

ప్రజల ఇంటి వద్దకే క్యూ ఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త రైస్ కార్డును పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందిే.
రేషన్ కార్డు ఇచ్చే సమయంలో...
కొత్త రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ లేదా పేస్ లేదా ఐరిష్ లేదా ఆధార్ ఓటిపి లో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్ లో ఉద్యోగులు సబ్ మిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయం తో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Next Story

