Mon Mar 23 2026 01:38:17 GMT+0530 (India Standard Time)
ఏపీ మూవీ టిక్కెట్లపై జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియంగా విభజించి టిక్కెట్ ధరలను నిర్ణయించిది. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ , నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలు, ఏసీ, నాన్ ఏసీలుగా విభజించి ధరలను నిర్ణయించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ జీవోను విడుదల చేసింది.
కనిష్టంగా 20 రూపాయలు....
సినిమా టిక్కెట్ల ధరలను కనిష్టంగా ఇరవై రూపాయలు, గరిష్టంగా 250 రూపాయలు నిర్ణయించారు. ప్రతి థియేటర్ లో నాన్ ప్రీమియం సీట్లను 25 శాతం కేటాయించాలని జీవో లో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలపై జీవోను జారీ చేయడంతో టాలీవుడ్ ప్రధాన సమస్య తీరినట్లేనని అంటున్నారు.
Next Story

