Fri Dec 05 2025 21:53:04 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల నుంచి పాఠశాలలు ప్రారంభం కాకముందే ఉపాధ్యాయ బదిలీలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ మాస్టర్లకు ఐదేళ్లు, ఉపాధ్యాయులు ఎనిమిదేళ్ల సర్వీసు ఒక చోట పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.
పాయింట్లను నిర్ణయించి...
ఇందుకోసం పాయింట్లను కూడా నిర్ణయించారు. మే 31వ తేదీ నాటికి ఏర్పడే ఖాళీలను దృష్టిలో ఉంచుకుని బదిలీలు జరుగుతాయి. గత కొంత కాలంగా ఉపాధ్యాయ బదిలీలను జరపాలని ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేయనున్న వారి స్థానంలోనూ నియమించనున్నారు
Next Story

